Breaking: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల..సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

మొదటి విడత జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు.తెలంగాణకు చెందిన విద్యార్థి యశ్వంత్, ఏపీ విద్యార్థులు పి.ఆదినారాయణ, కె.సుహాస్ వంద పర్సంటైల్ సాధించారు.

JEE Main ఫస్ట్‌ సెషన్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ (JEE Main) మొదటి విడుత ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. రాష్ట్రానికి చెందిన యశ్వంత్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీ. ఆదినారాయణ, కే.సుహాస్‌, కే.ధీరజ్‌, అనికేత్‌ చటోపాధ్యాయ, రూపేశ్‌ వంద పర్సంటైల్‌ సాధించారు.

జేఈఈ మెయిన్‌ పరీక్షలు జూన్‌ 23 నుంచి 29 వరకు ఎన్‌టీఏ నిర్వహించింది. ఈ నెల 6న ఫైనల్‌ కీని విడుదల చేసింది. తాజాగా ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.in లో అందుబాటులో ఉంచింది. అయితే ప్రస్తుతానికి జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 (బీఈ, బీటెక్‌) సంబంధించిన ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. పేపర్‌-2 (బీఆర్క్‌, బీ ప్లానింగ్‌) ఫలితాలు విడుదలవ్వాల్సి ఉన్నది. ఈఏడాది రాష్ట్రం నుంచి 50 వేలకుపైగా విద్యార్థులు మొదటి విడుత పరీక్షలకు హాజరయ్యారు.

JEE Mains 2022: జేఈఈ మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారా? ఈ టిప్స్‌తో 150 నుంచి 200 మార్కులు సాధించండి

JEE Mains 2022 Session 2 | జేఈఈ మెయిన్స్ 2022 సెషన్ 2 పరీక్ష జూలై 21న ప్రారంభం కానుంది. ఈ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా 150 నుంచి 200 మార్కులు సాధించవచ్చు.

  • 1. జేఈఈ మెయిన్‌లో 150-200 మార్కులు సాధిస్తే వాటిని చాలా మంచి మార్కులుగా ప‌రిగ‌ణిస్తారు. మునుపటి సంవత్సరాలలో జేఈఈ మెయిన్ (JEE Main 2022) కట్-ఆఫ్‌లు, ర్యాంక్ విశ్లేషణల ప్రకారం, 150-200 మధ్య స్కోర్ మీకు టాప్ ఎన్ఐటీలలో (NIT) ప్రవేశం పొంద‌డానికి చాలా స‌హాయ‌ప‌డుతుంది. దీంతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced), IITలకు కూడా అర్హత పొందుతారు. అయితే మెయిన్స్ లో మంచి స్కోర్ చేయ‌డం ఎలాగో ఇప్పుడు చూద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
  • 2. అన్ని అంశాలను కవర్ చేయడానికి ఒక మంచి స్ట‌డీ టైం టేబుల్‌ను రూపొందించండి. స‌రైన ప్రణాళిక లేక‌పోతే చిన్న సులభమైన అధ్యాయాలపై చాలా సమయం వృధా అవ‌డ‌మే కాకుండా ముఖ్యమైన అంశాలు మిస్ అవుతారు. JEE ముఖ్య‌మైన అంశాల‌ను కవర్ చేయడానికి NCERT పాఠ్యపుస్తకాలను చదవండి, ముఖ్యంగా కెమిస్ట్రీ (స్కోరింగ్ విభాగం). మ్యాథ్, ఫిజిక్స్ కోసం కోచింగ్ మాడ్యూల్స్ లేదా రిఫరెన్స్ బుక్స్‌లో వ‌చ్చే ప్రశ్నలు అడుగుతారు గుర్తుపెట్టుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
  • 3. ఒకే అంశాలు అధ్యాయాలను తెలుసుకోవడానికి నాలుగైదు పుస్తకాలు లేదా మెటీరియల్‌లను ఫాలో అవ్వ‌ద్దు ఎదో ఒక పుస్త‌కం ఫాలో అయితే స‌రిపోతుంది. థియరీ పాయింట్లు, నోట్స్, ఫార్ములాల కోసం ప్రత్యేక నోట్స్ ను రాసుకోండి. ప్రాక్టీస్ ప్రశ్నలు పరిష్కరించడం సరైన సమాధానం వ‌చ్చేలా ప్రాక్టీస్ చేయండి. తక్కువ సమయంలో మీరు ప్ర‌శ్న‌ల‌ను ఆన్ష‌ర్ చేస్తోన్నారో లేదో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
  • 4. JEE మెయిన్ మునుపటి సంవత్సరాల పేపర్లు, ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లను త‌క్కువ స‌మ‌యంలో  పరిష్కరించ‌డం ప్రాక్టీస్ చేయండి. పరీక్షలలో మీ పనితీరును విశ్లేషించండి.మీకు మీరుగా నిర్వ‌హించుకునే టెస్ట్ లో ముందు తప్పులను నోట్ చేసుకోని వాటిని సరిదిద్దుకోండి. ప్రశ్నలను పరిష్కరించడంలో వేగం ఎంత ముఖ్యమో మీ ఖచ్చితత్వాం కూడా అంతే ముఖ్యం అనే విష‌యాన్ని తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
  • 5. ప్రశ్నకు సమాధానమివ్వడానికి తొందరపడకండి ఆలోచించి స‌రైన స‌మాదానాలు రాయ‌డం అల‌వాటు చేసుకోండి. JEE మెయిన్‌లోని చాలా ప్రశ్నలు పూర్తిగా ఫార్ములా ఆధారితమైనవి కాబట్టి అన్ని ఫార్ములాలను వారానికి 2-3 సార్లు రివైజ్ చేస్తూ ఉండండి. మీ అవసరం కంటే ఎక్కువ లక్ష్యం పెట్టుకోండి. మీరు 250 టార్గెట్ చేస్తే, 200 పొందడం సులభం అవుతుంది. 150 స్కోర్ చేయడానికి, కనీసం 200 లక్ష్యంగా పెట్టుకోండి. పేపర్‌లో కనీసం 70-80% ప్రయత్నించండి. (ప్రతీకాత్మక చిత్రం)

JEE Main Result 2022: నేడు జేఈఈ మెయిన్స్‌ సెషన్‌ 1 ఫలితాలు..? సుమారు 7 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూపులు..!

jeemain.nta.nic.in: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 ఫలితాలు నేడు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరైన 7 లక్షల మంది విద్యార్థులు https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌ ద్వారా స్కోర్‌ చెక్ చేసుకోవచ్చు. ఇందుకు తమ అడ్మిట్ కార్డులను సిద్ధంగా ఉంచుకోవాలి.

JEE Main Result 2022: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 ఫలితాలు నేడు విదులయ్యే అవకాశం ఉంది. ఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు హాజరైన 7 లక్షల మంది విద్యార్థులు స్కోర్‌ చెక్ చేసుకోవచ్చు. ఇందుకు తమ అడ్మిట్ కార్డులను సిద్ధంగా ఉంచుకోవాలి. స్కోర్ కార్డ్‌లు https://jeemain.nta.nic.in/ లేదా https://nta.ac.in/ లో అందుబాటులో ఉంటాయి.

జెఇఇ మెయిన్ ఫలితాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు

మనతెలంగాణ/హైదరాబాద్ : జెఇఇ మెయిన్ తొలి విడత ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టత ఇవ్వడం లేదు. గత రెండు రోజులుగా ఫలితాలు వెలువడతాయని విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై ఎన్‌టిఎ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రతి రోజూ ఈరోజు లేదా రేపు ఫలితాలు వెలువడతాయని విద్యార్థులు రెగ్యులర్‌గా వెబ్‌సైట్ చెక్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన జెఇఇ మెయిన్ ఫైనల్ కీ ని ఎన్‌టిఎ ఇటీవల విడుదల చేసింది. ఫైనల్ కీ తో పాటే ఫలితాలు వెలువడతాయని ఆశించగా, ఇప్పటివరకు ఫలితాలు వెలువడలేదు.

JEE Main 2022 Session 1 Result 2022 Helpline Number

JEE Main Result 2022 లో విద్యార్థులు పర్సంటైల్ స్కోర్ పొందుతారు. పర్సంటైల్ స్కోర్లు కంపారేటివ్ మార్కింగ్ సిస్టమ్ ఆధారంగా వెలువడుతాయి. విద్యార్థులు పొందిన మార్కులను ప్రతి సెషన్‌కు 100 నుంచి 0 వరకు స్కేల్‌ చేస్తారు. పర్సంటైల్ స్కోర్ అనేది మొత్తం ఎగ్జామినేషన్ నార్మలైజ్డ్ స్కోర్ (అభ్యర్థి సాధించిన మార్కులకు బదులుగా) ఈ స్కోర్‌తో మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. స్కోర్ సమానంగా రాకుండా, బంచింగ్ ఎఫెక్ట్‌ను నివారించడానికి పర్సంటైల్ స్కోర్‌ను 7 దశాంశ స్థానాల వరకు లెక్కిస్తారు.

నార్మలైజేషన్ ఎందుకంటే..?
NTA అనేక తేదీలలో JEE Main పరీక్షలను నిర్వహించవచ్చు. సాధారణంగా రోజుకు రెండు సెషన్‌లలో ఎగ్జామ్ ఉంటుంది. అభ్యర్థులకు ప్రతి సెషన్‌కు వేర్వేరు ప్రశ్నలు ఇస్తారు. వివిధ ప్రశ్నపత్రాల మధ్య సమానత్వాన్ని కొనసాగించడానికి అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, వివిధ సెషన్‌లలో ఈ ప్రశ్నపత్రాల డిఫికల్టీ లెవల్ ఒకే విధంగా ఉండకపోవచ్చు. ఇతర సెట్‌లతో పోల్చినప్పుడు కొంతమంది అభ్యర్థులకు కఠినమైన ప్రశ్నలు రావచ్చు.

ఈ సందర్భంలో కఠినమైన ప్రశ్నలు వచ్చిన పరీక్ష రాసిన అభ్యర్థులు సులభమైన పరీక్ష రాసిన వారితో పోలిస్తే తక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించడానికి పర్సంటైల్ స్కోర్ ఆధారంగా నార్మలైజేషన్ విధానాన్ని ఉపయోగిస్తారు. ఈ వివరాలన్నింటినీ NTA అధికారిక నోటీసులో వెల్లడించింది.

టై బ్రేకింగ్ పాలసీ ఎలా ఉంటుందంటే..?
మొదట మ్యాథ్స్ స్కోర్‌ను NTA పరిగణనలోకి తీసుకుంటుంది. తర్వాత వెయిటేజీ ఉండే సబ్జెక్ట్ ఫిజిక్స్. ఆ తర్వాత వెయిటేజీ కెమిస్ట్రీకి ఇస్తారు. అనంతరం పరీక్షలో అన్ని సబ్జెక్టుల్లో తప్పు సమాధానాలు, సరైన సమాధానాలు తక్కువ నిష్పత్తిలో ఉన్న అభ్యర్థికి వెయిటేజీ ఉంటుంది. ఆ తర్వాత గణితంలో తప్పుడు సమాధానాలు, సరైన సమాధానాలకు తక్కువ నిష్పత్తి ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు.

అనంతరం ఫిజిక్స్‌లో తప్పుడు సమాధానాలు, సరైన సమాధానాలకు తక్కువ నిష్పత్తి ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు కెమిస్ట్రీలో తప్పుడు సమాధానాలు, సరైన సమాధానాలకు తక్కువ నిష్పత్తి ఉన్న అభ్యర్థికి ప్రాధ్యాన్యం లభిస్తుంది. వయసులో పెద్ద అభ్యర్థికి, ఆఖరికి ఆరోహణ క్రమంలో అప్లికేషన్ నంబర్‌కు ప్రయారిటీ ఇస్తారు. ఇది మొదటి సెషన్ రిజల్ట్స్ కాబట్టి, ర్యాంక్ లిస్ట్‌ను ఇప్పుడే విడుదల చేయరు. సెషన్ 2 ఫలితాలు వెలువడిన తర్వాతనే ర్యాంక్‌ లిస్ట్‌ను వెల్లడిస్తారు.

Leave a Reply

Your email address will not be published.