Vishwak Sen – Arjun Sarja Movie Openingవరుస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్నాడు యువ హీరో విశ్వక్ సేన్. ఇటీవలే అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. అటు మాస్, ఇటు క్లాస్ సినిమాలతో మెప్పిస్తున్నాడు…..
Pawan Kalyan : వరుస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్నాడు యువ హీరో విశ్వక్ సేన్. ఇటీవలే అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమాతో వచ్చి హిట్ కొట్టాడు. అటు మాస్, ఇటు క్లాస్ సినిమాలతో మెప్పిస్తున్నాడు. ఇటీవలే విశ్వక్ తన నెక్స్ట్ సినిమాని కూడా అనౌన్స్ చేశాడు. యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడిగా, ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా విశ్వక్ హీరోగా ఓ సినిమాని ప్రకటించారు. దీనికి నిర్మాత కూడా అర్జున్ కావడం విశేషం.
తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా విచ్చేసారు. హీరో విశ్వక్, హీరోయిన్ ఐశ్వర్య మీద పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సినిమాకి ‘కేజీఎఫ్’ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చిన్న హీరోల సినిమా ఫంక్షన్లు, చిత్ర కార్యక్రమాలకు హాజరవుతూ సపోర్ట్ చేస్తున్నారు.
Arjun Sarja-Vishswak Sen Movie: అర్జున్-విశ్వక్ సేన్ మూవీకి క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
యాక్షన్ హీరో అర్జున్ సర్జా దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ సేన్, ఆయన కూతురు ఐశ్వర్య సర్జా హీరోహీరోయిన్లు ఓ సినిమా రాబోతున్ను సంగతి తెలిసిందే. ప్రొడక్షన్ నెం. 15న రాబోయే ఈ సినిమా నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గురువారం(జూన్ 23) రామానాయడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి నటుడు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హజరై హీరోహీరోయిన్ల తొలి సీన్‌కు క్లాప్ కొట్టాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ చిత్రానికి అర్జున్ కథా రచయిత, దర్శకత్వంతో పాటు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. అర్జున్‌కి మంచి స్నేహితుడైన జగపతిబాబు ఇందులో కీలకపాత్ర పోషించనున్నాడు.ఈ చిత్రానికి కెజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తారు.

Pawan Kalyan Arjun Sarja-Vishswak Sen Movie : విశ్వక్ సేన్ సినిమాకి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్..
Vishwak Sen -Arjun Movie: పవన్ సపోర్ట్..భుజం తట్టి నేనున్నానంటూ!
Vishwak Sen – Arjun Sarja Movie Opening :విశ్వక్ సేన్- హీరో అర్జున్ కాంబినేషన్ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ సమయంలో విశ్వక్ తో పవన్ భుజం తడుతూ మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Vishwak Sen – Arjun Sarja Movie Opening : విశ్వక్ సేన్- హీరో అర్జున్ కాంబినేషన్ సినిమా గురించి చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోండగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. యాక్షన్ కింగ్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న అర్జున్ సర్జా మళ్ళీ దర్శకుడిగా మారి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా, అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్ గా నటించబోతున్నారు. ఈ సినిమా అర్జున్ ఆయన సొంత బ్యానర్ శ్రీ రామ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.15గా తెరకెక్క నుంది. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ పై క్లాప్ కొట్టారు. అర్జున్ సర్జాతో పవన్ కు చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. దీంతో అర్జున్ ఆహ్వానించగానే పవన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్జున్- పవన్ ఆప్యాయంగా పలకరించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక విశ్వక్ తో పవన్ భుజం తడుతూ మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాతో అర్జున్ కూతురు.. ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి కెజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనుండగా ఆర్ఆర్ఆర్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించనున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన, లిరిసిస్ట్ చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్ బాలమురుగన్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.
యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఇటీవలే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా విజయంలో మంచి జోష్ లో ఉన్నారు. దీంతో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న అర్జున్ తో చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇది వరకు పలు చిత్రాలను దర్శకుడిగా తెరకెక్కించిన అర్జున్ చాలా రోజుల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు. మరి ఈ సినిమా ఈ అందరికీ ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాలి మరి.
ట్రెండ్ ఇన్: క్రేజ్ కా బాప్ పవన్ కల్యాణ్..అర్జున్‌తో పవర్ స్టార్..ఫొటోలు వైరల్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అశేష అభిమానులు..ఆయన సినిమా కోసం ఈగర్ గా వెయిట చేస్తుంటారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్, సినిమాలు రెండూ చేస్తున్నారు
వరుస సినిమాల షూటింగ్స్ లో ఫుల్ బిజీగా గడుపుతూనే..సమయం దొరికినపుడు ఇతర సినిమా ఫంక్షన్స్ కు హాజరవుతుంటారు. ఇటీవల నాని ‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పవన్ కల్యాణ్..తాజాగా శాండల్ వుడ్ (కన్నడ) యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ముహుర్తం, పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, అర్జున్ కూతురు జంటగా సినిమా తెరకెక్కనుంది. ఈ పిక్చర్ కు అర్జున్, స్టోరి, స్క్రీన్ ప్లే ఇవ్వడంతో పాటు దర్శకత్వం వహిస్తూ ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం. ఈ పిక్చర్ కు KGF ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
హైదరాబాద్ లో జరిగిన పూజా కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరై ముహుర్తం షాట్ కు క్లాప్ కొట్టారు. ఈ నేపథ్యంలో పవన్ అశేష అభిమానులు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా “Power Star” #PawanKalyan హ్యాష్ ట్యాగ్ పవన్ కల్యాణ్ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. దాంతో సదరు హ్యాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్ లోకి వచ్చేసింది.